సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో వైద్య విద్యార్థులకు శుభవార్త! ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి కార్యాలయ ఆవరణలో నిర్మాణం పూర్తీ చేసుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. 100 మంది వైద్య విద్యార్థుల చదువుకు అనుమతి లభించింది. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఉత్తర్వులు గత శనివారం జారీ చెయ్యగా, నేడు, సోమవారం జిల్లా అధికారులకు అందాయి. ఏలూరులో వైద్య విద్య తరగతి గదులన్ని వసతులతో పూర్తిస్థాయిలో నిర్మిస్తామని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇప్పటికే బాండ్లు సమర్పించింది. ఈ మేరకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు ఇటీవల ఏలూరు వచ్చి మరోసారి పరిశీలించారు. ప్రాక్టికల్‌ తరగతులు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం నియోజకవర్గ శివారు..దగ్గులూరు వద్ద పాలకొల్లు పరిధిలో మరో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మితమౌతున్న విషయం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *