సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ వైసీపీ పార్టీ ప్రసిడెంట్ గా ఎమ్మెల్సీ గా తదుపరి ఎమ్మెల్యే గా తదుపరి ఏకంగా ఉప ముఖ్య మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఏలూరు మాజీ మంత్రి ఆళ్ల నాని తాజగా నేడు, ఉండవల్లిలో నేటి మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ఆయన సమక్షంలో పార్టీలో కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఆళ్ల నాని ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలోఎన్నికలలో ఓటమి తరువాత కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆళ్ల నాని, తాజా నిర్ణయం ?తో ఏలూరులో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. స్వర్గీయ వై ఎస్ హయంలో తదుపరి జగన్ హయాంలో పలుమారులు ఎమ్మెల్యే గా కూడా ఇన్ని పదవులు అనుభవించి, కూడా ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన టీడీపీ లో చేరికను వ్యతిరేకిస్తూ, తాజగా సోషల్ మీడియా గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .
