సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికలలో, ఏపీ అసెంబ్లీ లో గత వైసీపీ ప్రభుత్వ అప్పుల గురించి 10 లక్షలు కోట్లు పైమాటే అంటూ.. రామకోటి తరహాలో ఎప్పుడూ జగన్.. జగన్.. అని స్తోత్రం చేస్తున్నారని, అయితే ఇప్పుడు చుస్తే గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిన అప్పులు కేవలం 6 లక్షల కోట్ల పైచిలుకు అని మరల మిరే ప్రకటించారని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ హామీలు అంటూ వాటిని మర్చిపోయారని, ఇక ప్రజలను మభ్యపెట్టి మొత్తంగా రూ.15 వేల కోట్ల కోసం, ట్రూ అప్ చార్జీల పేరుతొ ఇకపై కరెంట్ యూనిట్ కు సుమారు 2 రూపాయలు అదనపు భారం వేస్తున్నారని ఇది దారుణమని ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల నుంచి విద్యుత్ బిల్లులు చూస్తే ప్రజలకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉందని బొత్స తెలిపారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ట్రూ అప్ పేరిట సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని చెప్పారు. కూటమి నిర్వాకం పనుల వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గిపోయిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *