సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ లో మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇండ్లపై వరుసగా కేంద్ర ప్రభుత్వ ఐటి అధికారులు చేస్తున్న దాడులు .. వారి వారి ఇండ్లలో రహస్య అలమరాలలో కోట్ల రూపాయల డబ్బు దొరికిందని వస్తున్నా వార్తలు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక నేడు, బుధవారం ఐటి అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో మల్లారెడ్డి కుమారుడు మం త్రి పెద్ద కుమారుడు మహేం దర్రెడ్డి ఛాతీ నొప్పి తో అస్వ స్థతకు గురై సూరారంలోని ఆస్ప త్రిలో చేరటం మరో ట్విస్ట్ అయ్యింది. దీనిని బీజేపీ నేతలు డ్రామాగా కొట్టిపారేశారు. దానితో మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తమపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా దారుణంగా దాడులు చేయిస్తోందని, తన కుమారుడుని అధికారులు కొట్టారని , తాను తన కుటుంబసభ్యులు కాసినో క్లబ్ లు, హవాలా,బ్లాక్ మనీ దందాలు చేయడం లేదని.. న్యాయబద్ధం గా కళాశాలలు నడుపుతున్నామని, ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందిస్తున్నామని నా కుమారుడు ఇప్ప టికే భయం తో వణికిపోతున్నా డు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మం త్రికి చెందిన సం స్థలు, ఇళ్లపై ఐటీ దాడులను నిరసిస్తూ కీసరలో తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *