సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తణుకు రురల్ పోలీసులు తెలుగు రాష్ట్రాలలో లక్షలాది రూపాయలు, మోటారు వాహనాలు చోరీలు చేస్తున్న ఒక గజ దొంగను పట్టుకొని , తణుకు రురల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ఆంజనేయులు మాట్లాడుతూ.. పట్ట పగలు వీధుల వెంట మాములుగా తిరుగుడు రెక్కీ నిర్వహిస్తూ, రాత్రి చోరీలు చేస్తున్న,పైబోయిన ధన వెంకట రాము అనే నిందితుడిని అరెస్టు చేసి రూ.5.14 లక్షల విలువైన ఎనిమిది ద్వి చక్రవాహనాలు, 23 గ్రాముల బంగారు ఆభరణాలు, 16.7 గ్రాముల వెండి ఆభరణాలను గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకొన్నామని , నిందితుడు ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోరీల కేసుల్లో నిం దితుడు. ప్రస్తుతం ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో నివాసం ఉంటున్నా డు. స్థానిక వై జంక్షన్లో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని , వాహనాలు, సొమ్ము స్వాధీనము చేసుకొని విచారించగా అతను నేరాలకు పాల్బడినట్లు అంగీకరించాడని తెలిపారు.ఎస్సై రాజకుమార్ ను పోలీస్ సిబ్బందిని అబినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *