సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో గత సోమవారం ఆర్జించిన లాభాలు కు వెంటనే బ్రేక్ వేస్తూ నేడు, మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా సూచీలు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా మెటల్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగాయి. కాగా, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.96) మారకం విలువ బలపడింది ( stock market).గత సెషన్ ముగింపు (78,285)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం సమయంలో మరింత పైకి వెళ్లింది. అయితే చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో చివరకు సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 78,180 వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ కూడా 31 పాయింట్ల నష్టంతో 24,398 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 186 పాయింట్ల నష్టపోయింది.
