సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాపట్ల జిల్లా పర్చూరు లో నేడు, శనివారం సాయంత్రం జరిగిన రా !కదలిరా! బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక సైకో అని ఏపీను చెరబట్టి వ్యవస్థలను నాశనం చేశారని అటువంటి బకాసురుడిని జయించడానికి ఒక వైపు తెలుగుదేశం.. మరో వైపు జనసైన్యం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదేనని… అసలు అనుమానమే లేదని అయితే రాముడికి కూడా కష్టాలు తప్పలేదని… టీడీపీ నేతలు ఈ కూటమి కోసం కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. అయితే బీజేపీ ఊసు ఎత్తలేదు… జగన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని… ఇంకా 52 రోజులే మిగిలి ఉన్నాయని, నా రాజకీయ అనుభవం ముందు జగన్ ఒక బచ్చా.. జగన్ తండ్రే నాకు భయపడ్డాడు.. అలాంటి బచ్చాకు నేను భయపడను. 52 రోజుల తర్వాత టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని తెలిపారు. వైసీపీ నేతలు అడ్డం వస్తే… తొక్కుకుంటా పోతాం.. అంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ క్యాడర్ ను ఉత్సహ పరిచే ప్రయత్నం చేసారు.
