సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీసీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. రైలు ప్రమాద ఘటనలో ఏపీ ప్రయాణికుల వివరాలపై ప్రభుత్వం ఆరా తీసింది. యశ్వంత్‌పూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన 52 మంది ఉన్నట్లు గుర్తించారు. కోరమండల్‌ రైలులో విజయవాడ డివిజన్‌కు చెందిన 48 మంది ఉన్నట్లు సమాచారం. హౌరా ఎక్స్‌ప్రెస్‌ ఎక్కినవారిలో బాపట్లలో 2, విజయవాడలో 4, చీరాలలో 12, గూడురులో 2, నెల్లూరులో 2, ఒంగోలులో 2, రాజమండ్రిలో 2, తిరుపతిలో 18 మంది ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రాజమండ్రి, ఏలూరు, తాడేపల్లి గూడెం,ఏలూరు, విజయవాడ స్టేషన్స్ లో ఆగి ప్రయాణించడం తో ఈ ప్రాంత ప్రజలు తమ వారు ఎవరైనా ఆ రైల్ ఎక్కారేమో? అని వాకబు చేస్తున్నారు.కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుండి నేటి,శనివారం ఉదయం 7 గంటలకు 53 మంది వరకూ రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉంది. ఏపీ ప్రయాణికుల వివరాలపై రైల్వే అధికారులు ఆరా తీశారు. తిరగబడ్డ కోచ్‌ల కింద చిక్కుకుపోయి.. ఇరుక్కుపోయి.. కాళ్లు, చేతులు తెగి.. కాపాడాలంటూ హృదయవిదారకంగా వారు చేస్తున్న ఆర్తనాదాలు..సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతుండడంతో సమాచారం ఇప్పటికిప్పుడే రాదని రైల్వే అధికారులు తెలిపారు. ఏపీ ప్రయాణికులను పరామర్శించి ఆదుకోవడానికి రాష్ట్ర మంత్రి అమరనాద్ ఒరిస్సా వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *