సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి , ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసీన అధినేత పవన్ ఓటు పిఠాపురం లో లేదు.. ఆయన ఓటు మంగళగిరి లో వినియోగించుకోవలసి రావడం గమనార్హం. సీఎం, జగన్మోహన్ రెడ్డి తన సతీమణి భారతీతో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు. గుంటూరు ప్రకాశం జిల్లాలలో స్వల్ప ఉద్రిక్తలు చోటు చేసుకొన్నట్లు మినహా అంతా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు సమయం 9 గంటలు దాటింది. ఇప్పటికే పోలింగ్ శాతం 20 శాతం పూర్తీ అయి ఉంటుందని ఒక అంచనా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *