సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం స్థానిక రెస్ట్ హౌస్ రోడ్ శంకర మఠం వద్ద ఆర్ అండ్ బి అధికారులతో గతంలో ఎనమదుర్రు కాలువపై 5ఏళ్ళ క్రిందట కొత్త వంతెన నిర్మించి దానికి అనుబంధ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు రావడంతో లేక గత పాలకులు పాలనలో వృధాగా వదిలేసిన దానికి ఇప్పడు అడ్డంకులు పరిష్కరించి ప్రభుత్వ అనుమతులతో వాహనదారులకు ఉపయోగంలోకి తెచ్చేందుకు అప్రోచ్ మెంట్ రోడ్ వెయ్యడానికి కావలసిన ప్లాన్ ఫై వారి సూచనలు ఫై సమీక్షలు జరిపారు. అక్కడ హోల్ సెల్ చేపల మార్కెట్ నుండి ఎంఆర్ అపార్ట్మెంట్స్ వరకు వరకు రోడ్ల పరిస్థితి దుర్భరంగా ఉండటాన్ని రోడ్డుపై నడుస్తూ గమనించారు. దానితో స్థానిక మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ ను పిలిపించారు. ఆర్ అండ్ బి అధికారులతో పాటు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నడుస్తూ .. తీవ్ర ఆగ్రహంతో .. ఆ గుంతలను చూసి గతంలోనే వీటిని సరిచేయాలని మిమ్ములను ఆదేశించాను. కానీ ఇప్పటికి అలానే వదిలేసారు. మిమ్ములను ఇక్కడకు రండి అంటే ఫోన్ లో వచ్చేసాను అని అబ్బదం చెప్పారు. మీరు ప్రజల కోసం కష్టపడి పని చేస్తారనే కదా ? ఇక్కడ కమిషనర్ గా వేయించుకొంది. బాధ్యత లేకపోతె ఎలా? లేకపోతె కలెక్టర్ గారికి చెప్పేయండి. నేను చెయ్యలేను అని .. రోడ్డులు బాగోలేదని వాటి పరిస్థితి బాగుచేయాలని నేను ఆదేశించిన ఆర్ అండ్ బి అదికారులతో, కాంట్రాక్టర్ లతో సమన్వయము చేసుకొని వారి పని చేస్తున్న తీరును మీరు శ్రద్ద పెట్టకపోతే ఎవరు చేస్తారు? పద్దతి మార్చుకోండి అని ఎమ్మెల్యే కమిషనర్ ను హెచ్చరించడం జరిగింది.
