సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి మన దేశ సరిహద్దులు గస్తీ కాస్తున్న భారత జవాన్లు సేవలు ను ప్రతి భారతీయుడు సదా గుర్తుంచుకోవాలి. వారు కుటుంబాలతో పండుగలు కూడా చేసుకోలేరు.. అటువంటి వారి సేవలకు గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా పాటిస్తున్న సంప్రదాయ ప్రకారమే నేడు, సోమవారం దీపావళి వేడుకల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళ సిబ్బందితో దీపావళి పండుగను జరుపుకొనేందుకు కార్గిల్ చేరుకున్నారు. జవాన్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వారికి మిఠాయిలు పంచి వారితో కలిసి దీపావళి సంబరాల్లో ప్రధాని పాల్గొంటారు.
