సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. గం .. గం .. గణపతియే నమః .. సర్వ శుభ ప్రదాత అన్ని గణాలకు అధినేత శ్రీ విఘ్నేశ్వరుడు.. రేపు శ్రీ వినాయక చవితి పర్వదినం సందర్భముగా భీమవరం పట్టణంలో వాడవాడలా స్థానిక యువత ఆధ్వర్యంలో వందలాది చవితి పందిళ్ళ సిద్ధం వేస్తున్న సందడి కనిపిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, విజయవాడ వరద బాధితుల సహాయార్ధం కోసం ఇక్కడి యువత శ్రద్ద పెట్టిన నేపథ్యంలో చవితి పందిళ్ళ సందడి కాస్త తగ్గినప్పటికీ నిన్నటి నుండి పందిళ్ళ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నాగరాణి విజ్ఞప్తి మేరకు పండుగను అందరూ ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకునే విధంగా పందిళ్లకు అనుమతులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో కూడా పందిళ్ళకు అనుమతి ఇస్తున్నారు. గతంతో పోలిస్తే శ్రీ వినాయక విగ్రహాలు అమ్మకాలు ఈసారి ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. భీమవరం పట్టణంలో జేపీ రోడ్డు, పద్మాలయ థియేటర్స్ పాత స్పెన్సర్స్ ఎదురుగ భారీ విగ్రహాల అమ్మకం ఏర్పాటు చేసారు. పలు కూడళ్లలో పాటు ఉండి లోని గణపవరం రోడ్డు లో ఉన్న బొమ్మల తయారీ కేంద్రాల నుండి పెద్ద సైజు అందమైన శ్రీ వినాయక విగ్రహాలు 5వేల రూపాయలు నుండి 30వేల రూపాయలు ధరల వరకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వినాయకులు వాహనాలపై యువత జై జై గణేశా! నినాదాల మధ్య పందిళ్ళకు తరలి వెళుతున్నారు. ఎప్పటి లాగే భీమవరంలో పందిళ్లు వేసి పంచమ రాత్రులు, నవత్రులు, 11 రోజులు చప్పున వారి వారి అవకాశాలు బట్టి ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా పట్టణంలో మెంటే వారి తోటలో గునుపూడి , స్థానిక గన్నాబత్తుల వారి వీధి, మోటుపల్లి వారి వీధి ,సుంకర పదయ్యా వీధి,దుర్గాపురం, శ్రీ శ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయ ఆవరణలో , పలు అపార్ట్మెంట్స్ లో చక్కటి పందిళ్ళలో వినాయకులు 5 నుండి 10 అడుగుల వరకు భారీ విగ్రహ రూపాలలో పూజలు అందుకోనున్నారు.
