సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణలో పరిశుభ్రత లో తాజగా రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధించింది. ఏలూరు జిల్లాలో 1233 ట్యాంక్‌ల క్లీనింగ్‌కు గాను 1,196 క్లీనింగ్ చేసి 97 శాతం ప్రగతిని జిల్లా సాధించింది. క్లోరినేషన్ విషయంలో జిల్లాలో 1271 ట్యాంకులకు 1264 ట్యాంకులలో క్లీనింగ్ చేసి 99.45 శాతం ప్రగతి సాధించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్తా చెదారం క్లీన్ చేయడడంలో 100 శాతం ప్రగతి సాధించింది. రోడ్ల ప్రక్కన డ్రైన్స్ కు అడ్డుగా ఉన్న పొదలు తొలగింపు విషయంలో 1097 ప్రదేశాలకు 1094 ప్రదేశాల్లో చేసినందుకు 99.73 శాతం, మురుగు కాల్వల్లో పూడిక తీతకు సంబంధించి 97.34 శాతం, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించడంలో 99.60 శాతం ప్రగతి సాధించి ప్రభుత్వం ఇచ్చిన ఆరు టాస్క్‌లలో ఓవర్‌ఆల్‌గా 99.13 శాతం మార్కులు సాధించింది. . అన్నమయ్య జిల్లా ద్వితీయ స్థానం సాధిం చగా, వైఎస్‌ఆర్ కడప జిల్లా తృతీయ స్థానాలు సాధించాయి. పారిశుధ్య నిర్వహణలో ఏలూరు జిల్లా ప్రథమ స్థానం సాధించినందుకుగాను జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ను గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి కొణిదెల పవన్‌కళ్యాణ్ అభినందించారు.
