సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో కింగ్ లా ఉండే జిల్లా కేంద్రం భీమవరంలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారం పూర్తిగా కుదేలు అయ్యింది. అమ్మేవారు ఉన్న ఎక్కడ కొనేవారు లేరు. అంతా అగమ్య గోచరంగా ఉంది. కరోనా కిష్ట సమయంలో దాదాపు 3 ఏళ్ళు కూడా ఇంతటి దారుణంగా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిపోయాయి.గోదావరి నది ప్రక్కనే ఉన్న సరే.. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక మాట దేవుడు ఎరుగు.. గతం కన్నా ఇసుక పొందటం కష్టం అయ్యింది. నిర్మాణాలు కూడా తగ్గిపోయాయి. ఇక ఎప్పుడు కొనుగోళ్లు అమ్మకాలతో కళకళ లాడే భీమవరం రిజిస్టర్ కార్యాలయం గత కొంతకాలంగా బోసి పోయి ఉంటుంది. ఆశించిన స్థాయిలో రిజిస్ర్టేషన్‌లు జరగడం లేదు. భీమవరం సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో గత ఏడాది రూ.100 కోట్లు పైగా అవలీలగా లక్ష్యం కు దగ్గరగా వస్తే ఈఏడాది నెలకు 10 కోట్లు పైగా చప్పున 125 కోట్లు లక్ష్యాన్ని సాధించాలని టార్గెట్ పెడితే ఇటీవల నెలకు 3 కోట్లు దాటటం కష్టంగా కనిపిస్తుంది. పట్టణంలో లే అవుట్స్ తగ్గిపోయాయి. అపార్ట్‌మెంట్ల నిర్మాణం దాదాపు నిలిచి పోయింది. ఉన్న అపార్ట్మెంట్ లలో ప్లాట్ లు తక్కువ ధరకే వివిధ స్కీమ్స్ పెట్టి ఎదో రకంగా తోసెయ్యడమే జరుగుతుంది.. ప్రజలలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. భీమవరం అభివృద్ధికి కీలక మైన ఆక్వా ఆదాయాలు తగ్గిపోయాయి. ఇది వినియోగదారులకు మాత్రం మంచి కాలమని చెప్పవచ్చు.. ఉదాహరణకు జిల్లాలోనే అత్యధిక 16 ప్లోర్ లతో అపార్ట్ మెంట్ నిర్మాణం అంటూ భీమవరంలో గత కొంతకాలంగా భారీ వేంచేర్ ప్రారంభమయిన కూడా కొనుగోళ్లు దారులులో ఆర్ధిక ఇబ్బందుల్లతో జోష్ తగ్గటంతో దానిని ప్రస్తుతం 8 ప్లోర్స్ కు మార్చారు ..ఆలా ఉంది వాస్తవ పరిస్థితి. మరి భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి.. అయితే మరల ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని రియల్ వ్యాపారులు ఆశగా ఎదురు చూస్తున్నారు..
