సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలంలో జయాపజయాలుకు అతీతంగా శరవేగంగా సినిమాలు చేస్తున్న యువ హీరో.. కిరణ్ అబ్బవరం .. సినిమాలలో నిజంగా సరికొత్త కదంశం తో పాన్ ఇండియా స్థాయిలో చేసిన అపూర్వ ప్రయోగం ‘క: ది సోల్’ (KA Review) నేడు, గురువారం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ నటులు లేరు. నటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్‌కుమార్, రెడిన్ కింగ్ నటించగా .. రచన, దర్శకత్వం: సుజీత్ – సందీప్. అనే ఇద్దరు కలసి నిర్వహించారు. ఇక సినిమా కధ విషయానికి వస్తే..1980ల్లో సాగే కథ ఇది. కొండల మధ్య ఉండి, మధ్యాహ్నాం మూడు గంటలకే చీకటి పడే క్రిష్టగిరి గ్రామం, అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధ, తన తల్లిదండ్రుల జాడ తెలుసుకోవాలని తపన పడుతుంటాడు. ఎవరూ లేని అతనికి గురునాధం (బలగం జయరామ్) ఆశ్రయమిస్తాడు. చిన్నప్పటి నుంచి వాసుదేవ్‌కి ఇతరుల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. ఆ ఉత్తరాల రాతల్లో తాను పొగొట్టుకున్న బంధాల్ని చూసుకుంటాడు. కృష్ణగిరి అనే మారుమూల పల్లెలో కాంట్రాక్ట్ పోస్ట్‌మెన్‌గా చేరతాడు. అక్కడ తెల్లవారుజామునే అమ్మాయిలు మిస్ అవ్వడం గమనిస్తాడు. ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్‌కు మిస్సింగ్ కేసులకు సంబంధించి ఓ విషయం తెలుస్తుంది. ఆ క్రమంలో ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. అభినయ్ వాసుదేవ్ ఓ చీకటి గదిలో బంధీగా ఎందుకు ఉన్నాడు. ? చీకటి గదిలో ఉన్న రాధ (తన్విరామ్) ఎవరు? అక్కడ ఏమి జరిగింది అన్నది వెండి తెరపై చూడవలసిందే.. సినిమా ప్రమోషన్స్‌లో కిరణ్ అబ్బవరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా మాట్లాడారు. ‘ఇలాంటి కథ ఇప్పటి వరకూ రాలేదు, వస్తే సినిమాలు మానేస్తా’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిజంగా అటువంటి సినిమా చేసాడని చుసిన ఎవరైనా ఒప్పుకొంటారు. ఆలా తీశారు సినిమా.. మనిషి పుట్టుక.. కర్మ, దాని పర్యావసానం, రుణానుబంధాలకు ముడివేసి .. ముసుగు వ్యక్తి కాలచక్రం సాయంతో హీరోని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లి ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పించిన తీరు బావుంది, ప్రేక్షకులకు ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతే.. ఆ ట్విస్ట్ నుంచి సెకండాఫ్ మరింత ఆసక్తిగా సాగింది. అయితే సినిమా క్లైమాక్స్ చేరుకునే సరికి ఆఖరి 20 నిముషాలు ఒక అద్భుతమైన అనుభూతి ప్రేక్షకుడికి కలిగించారు కోర్టు దగ్గర యాక్షన్ సీక్వెన్స్, క్లైమాక్స్ ఫైట్ మరింత అలరిస్తాయి. ఆర్ట్ వర్క్ అంతా బాగా కుదిరింది. కెమెరా వర్క్ సినిమాకు అదనపు ఆకర్షణ. సంగీతం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది.. పాటలు బావున్నాయి. జాతర పాట ప్రేక్షకులను ఊపేస్తుంది. చిన్న స్థాయి తారాగణం అయిన నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గలేదు.
