సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలతోపాటు.. పట్టణంలో ప్రజలు భోగి మంటలు వేసుకుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచం లో ఎక్కడ ఉన్న తెలుగువారు ఎక్కువమంది తమ కుటుంబ మూలాలకు చేరుకొని ఆనందంగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిల్లీ నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.వీరితో పాటు భీమవరం కు చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.. వేడుకల్లో భాగంగా ఆయన ఇంటి ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అతిథులకు రుచి చూపించేందుకు పలు రకాల సంప్రదాయ వంటకాలను సిద్ధం చేశారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో వారితోపాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.
