సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ కు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల ఆమె భర్త గూడూరి జగదీష్, కుమారుడు నేడు, సోమవారం భీమవరం 3 టౌన్ లోని 130 పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకొన్నారు. తదుపరి పట్టణంలో పలు బూత్ లలో ఓటింగ్ సరళిని పరిశీలించి పాలకొల్లు వెళ్లారు. అక్కడ కీలక .పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకుంటున్న వైసీపీ అభ్యర్థిని తదుపరి మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాల లో పోలింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లారు.
