సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణాదిన స్వర్గీయ సూపర్’స్టార్ కృష్ణ ఎంతటి అందగాడో అందరికి తెలిసిందే.. మరి అతని కి జంటగా సినిమాలలో 45 చిత్రాల్లో నటించిన ఘనత జయప్రదది మాత్రమే.. అలాగే స్వర్గీయ శ్రీదేవి కెరీర్ లో ఆమె సరసన అత్యధికంగా 31 చిత్రాలలో నటించిన హీరో కూడా కృష్ణే..వీరిద్దరిని హిందీ సినిమాలు నిర్మించి టాప్ హిట్స్ తో అక్కడ టాప్ హీరోయిన్స్ గా మార్చిన ఘనుడు కూడా కృష్ణే మరి.. ఇక విజయనిర్మల కూడా 40 చిత్రాలలో నటించడం మరో విశేషము. అయితే , రాధా, విజయశాంతి లు కూడా హిట్ పెయిర్ గా ఆయన సరసన సుమారుగా 20 సినిమాలు వరకు నటించారు. సౌందర్య కూడా దాదాపు 6 సినిమాలు వరకు నటించగా ‘నెంబర్ వన్’ మరల ఆయనకు పూర్వ వైభవం తెచ్చింది. పుట్టింటి గౌరవం మరో సూపర్ హిట్. ఇక జయలలిత, కాంచనమొదలుకొని రోజా, మందాకినీ, రమ్య కృష్ణ, నగ్మా, ఇంద్రజ, ప్రేమ లు కూడా పలు చిత్రాలలో ఆయనతో మెప్పించారు.ఆయన హీరోగా కాకుండా ప్రత్యేక మెరుపు పాటల్లో నటించి న పలు సినిమాలు సూపర్ హిట్లే మరి యమ లీల, పిట్టల దొర , శుభమస్తు, శుభాకాంక్షలు, పెళ్ళాల రాజ్యం.. అటువంటి కేజ్ ఆయన సొంతం
