సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లోనే కాదు భారతదేశ సినీ చరిత్రలో సింహాసనాన్ని అధిష్టించిన ఒక అద్భుతం ఇక భూమిని వదిలి వెళ్ళింది. నేటి మంగళవారం తెల్లవారు జామున 4న్నరకు ఆయన అటు సినీపరిశ్రమ ఉన్నతికి, వ్యక్తిగత జీవితంలోను తన అలుపు సొలుపూ లేని పోరాటాలకు ముగింపు పలికి , ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికీ వీడ్కోలు పలికారు. సాహసానికి మరో రూపం, మంచి మనిషికి పర్యాయ పదంగా బ్రతికిన సూపర్ స్టార్ కృష్ణ రియల్ హీరోగా ఎన్నో సంస్థలతో పెద్ద వ్యవస్థగా మారి ఎన్నో వేలమందికి ఉపాధి కల్పించి తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్ బౌతికంగా ఇకలేరు అన్న బాధ తో దేశవ్యాప్తంగా ప్రముఖుల నుండి సంతాపాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్ లో .. కృష్ణగారి మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అని నివాళ్లు అర్పించారు.
