సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులను మోసం చేసిందని , రైతుల కష్టాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కొత్తగా తెచ్చిన చట్టాలను దేశంలో రైతులు గట్టిగ వ్యతిరేకించారు. ఆ నేపథ్యంలో ఢిల్లీ లో రైతు ఉద్యమానికి గతంలో మద్దతుగా నిలిచార నే ఆక్రోశంతో న్యూస్ క్లిక్ మీడియా సంస్థ పై తప్పుడు కేసు పెట్టీ ఎడిటర్, జర్నలిస్టు లను జైల్ లో పెట్టారని ఆరోపిస్తూ ,, ఈ చర్యను నిరసిస్తూ… ఉండి నియోజకవర్గం ఎండగండిలో CITU, రైతుసంఘం ఆధ్వర్యంలో FIR కాఫీ లు దగ్ధం చేసారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ గోదావరి జిల్లా, డివిజన్ కార్యదర్శి ఎన్ గోపాలన్ ప్రతులను దగ్ధం చేస్తున్న దృశ్యం పైన చూడవచ్చు..
