సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోచోటు చేసుకున్న అవకతవకలపై ఇటీవల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం కేసీఆర్, హరీష్‌రావు పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. ఇక దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదన్న హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావుకు హైకోర్టులో నిరాశ ఎదురయింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ఉంటే.. దానిని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే పిటిషనర్లు కోరిన విధంగా స్టే కూడా ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
