సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రైల్వే ట్రాక్ లైన్లు మరింత ప్రతిష్ఠపరిచే కార్యక్రమం శరవేగంగా జరుగుతుంది. దీనికి సం బంధించి పాత సిమెంట్ స్లీపర్లు తీసి వాటిని చేబ్రోలు గౌడౌన్ లో భద్రపరుస్తున్నారు. కొవ్వూరు లో తయారు చేసిన కొత్త సిమెంటు స్లీపర్లను ఇక్కడ నుంచి అవసరమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళి అమరుస్తున్నా రు. ఇకపై రైళ్లు 120 నుంచి 150 కిలోమీటర్లవేగానికి పెంచి నడిపేటట్లు సిమెంట్ స్లీపర్లను తయారుచేశారు. ప్రస్తుతం విజయవాడ–భీమవరం, కైకలూరు, తణుకు, అత్తిలి ప్రాంతం , ఏలూరు నుంచి నిడదవోలు మధ్యలో పాతవి తొలగించి కొత్త వాటిని అమర్చే పనులు నిర్వహిస్తున్నారు. కొత్త స్లీపర్లలో ఐరన్ ఎక్కువగా వాడడంతో రైలు వేగం ధాటికి తట్టుకునేలా తయారు చేశారు.రెండు స్లీపర్లకు మధ్య 60 సెంటీమీటర్లు దూరంతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లి గూడెం –ఏలూరు మధ్య రైల్వే ట్రాక్ లలో వీటి బిగింపు పూర్తి చేశారు. ప్రస్తుతం కై కలూరు –భీమవరం మధ్య కూడా పనులు శరవేగంగా చేస్తున్నారు. కాబ్బటి అటుగా వెళ్లే రైళ్లు కొన్ని సమయాలలో అనివార్యంగా కొంత ఆలస్యంగా పయనించే అవకాశం ఉంది.
