సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మొదలు కొని కృష్ణ జిల్లా వరకు విస్తరించిన కొల్లేరు సరస్సు అక్రమాలకు గురి అయ్యి చేపల చెరువులతో కాలుష్యం అయిన నేపథ్యంలో కొల్లేరు పరిసర ప్రాంత ప్రజల సమస్యల కు శాశ్వత పరిష్కారం చూపేందుకు వీలుగా ఈనెల10 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటించారు. నేడు, ఆదివారం ఏలూరు రూరల్ మండలం గుడివాకలంకలో రూ. కోటి వ్యయంతో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ సామర్థ్యం పెంచిన పవర్ ట్రాన్స్ఫార్మర్ ను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి కొల్లేరు సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లి సహకారం కోరటం జరిగిందని ఎంపీ తెలిపారు.దేశంలోనీ మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో సరస్సులు కుదించిన విధంగా కొల్లేరు ప్రాంతంలో కూడా కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదని, త్వరలోనే శుభవార్త వింటారని ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు.
