సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శనివారం . భీమవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆయన ముందుగా 34 వ వార్డులో 20 లక్షల 50 వేల నిధులతో సీత టవర్స్ నుండి గోపికృష్ణ టవర్ వరకు, ఎస్ ఆర్ కె ఆర్ రోడ్డు నుండి ఏ ఎస్ ఆర్ కళ్యాణ మండపం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 35వ వార్డులో 19 లక్షల50 వేల నిధులతో ఆదర్శనగర్ రెండవ వీధి నుండి వంశీకృష్ణ నగర్ లోని కాస్మో క్లబ్ వెనుక వరకు నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. తదుపరి 35వ వార్డులో 29 లక్షల 50 వేల నిధులతో ఉండి రోడ్డు నుండి వి ఎస్ ఎస్ గార్డెన్స్ వరకు నిర్మించిన బీటీ రోడ్డును, 36వ వార్డులో 10 లక్షల 50 వేల నిధులతో సత్యవతి నగర్ టౌన్ స్టేషన్ కాంపౌండ్ వాల్ నుండి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వరకు నిర్మించిన సిసి రోడ్డును, 37వ వార్డులో 23 లక్షల 50 వేల నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగున్నరేళ్ళగా అభివృద్ధి, సంక్షేమమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *