సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఈ మార్చి నెలలోనే ఎమ్మెల్యేల కోటా ఓట్ల ద్వారా 5గురు ఎం ఎల్సీ లను ఎన్నుకొనే అవకాశం ఉండటం తో ఇప్పటికే సీఎం చంద్రబాబు ను ఆశావహులు తమకు ఆ సీట్లను కేటాయించాలని కోరటం దానికి ఆయన పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి తమ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని కోరటం జరిగిందని ప్రచారం జరుగుతుంది. దానిలో సోదరుడు నాగబాబు కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ని చెయ్యడానికి గతంలో చంద్రబాబు ఇచ్చిన మాట నెరవేరుస్తారని భావిస్తున్నారు.. మరో వైపు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్య సభ ఉప ఎన్నికల్లో నాగబాబుకు కేటాయిస్తే ఆ పదవి కాలం 3 ఏళ్ళు లోపే ఉండటంతో దానికి విముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. పైగా విజయసాయి రెడ్డి తన స్థానాన్ని బీజేపీ కోసం త్యాగం చేసినట్లు ఆయనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇక టీడీపీ తరపున సీనియర్ నేతలు దేవినేని ఉమా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కు ఎమ్మెల్సీ లో స్తానం ఖాయం అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వారిరువురు చాల సహనం పాటిస్తున్నారు. ఇక బీజేపీ తరపున ఎమ్మెల్సీ లుగా సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి లకు అవకాశాలు కనపడుతున్నాయి.
