సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోడ్లు-భవనాల శాఖమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సచివాలయంలో ఏపీలో రోడ్ల పరిస్థితిపై అధికారులతో సమీక్షచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రలో గోదావరి జిల్లాలలో మరమ్మతులకు కూడా వీల్లేని విధంగా రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ నేపథ్యంలో 1,447 కిలోమీటర్ల మేర వాటిని పునర్నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూ.650 కోట్ల నాబార్డు నిధులు అందించేందుకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. . ఆ రహదారుల పునర్నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని రోడ్లు-భవనాల శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లపై గుంతలు పూడ్చేందుకు వివిధ పద్దుల కింద రూ. 861 కోట్లు కేటాయించారు. ఆర్‌అండ్‌బీ ఇప్పటి వరకు 1,991 కిమీ మేర గుంతలు పూడ్చినట్లు మంత్రి జనార్దన్‌రెడ్డి సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటీవలకురిసిన భారీ వర్షాలకు పూర్తిగా ధ్వంసమై ద్విచక్ర వాహనాలు నడపడానికి కూడా వీలులేని రోడ్లు 1,447 కిమీ వరకు ఉన్నాయని.. వాటిని పునర్నిర్మిస్తే తప్ప ప్రజలకు రహదారి సదుపాయం మెరుగ్గా కల్పించలేమని నివేదించారు.
