సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మానవాళి ని పట్టి పీడిస్తున్న రోగం క్యాన్సర్‌ను నయం చేయడానికి ఎంఆర్‌ఎన్‌ఏ అనే టీకాను రష్యా దేశం ఇప్పటికే సిద్ధం చేసిందని,సమాచారం బహిర్గతం అయ్యింది. పైగా రష్యా దేశ వ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఈ వ్యాక్సిన్‌ను 2025 ప్రారంభం లోనే రోగులకు పూర్తీ ఉచితంగా అందించేందుకు పుతిన్ ప్రభుత్వం సిద్ధపడుతుంది. .పలు పరిశోధనా సంస్థలతో కలసి రష్యన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ టీకాను అభివృద్ధి చేసిందని సమాచారం.తాజాగా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కామెంట్స్ చేశారు. క్యాన్సర్ టీకా తయారీ దాదాపుగా పూర్తయిందన్నారు. ట్రయల్స్ లో మంచి ఫలితాలు ఇచ్చిన ఈ వాక్సిన్ ను ఇతర దేశాలకు ఫ్రీగా సరఫరా చేయకపోయిన.. రష్యా మిత్ర దేశం మన భారత్ లో త్వరలోనే చాలా తక్కువ ధరకే రోగులకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి.
