సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభాస్, నయనతార పార్వతి పరమేశ్వరులుగా ప్రత్యక పాత్రలో టాలీవుడ్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ గా సుమారు 100 కోట్ల వ్యయంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’సినిమా షూటింగ్ మళ్లీ తాజాగా న్యూజిలాండ్లో రెండో షెడ్యూల్ను ప్రారంభించారు. ఇప్పటికే 90 రోజుల పాటు నిర్విరామంగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్రయూనిట్ మళ్ళి తాజాగా షూటింగ్ ప్రారంభించింది. దీనికి సంబంధించి విష్ణు, శరత్ కుమార్ తో కల్సి మోహన్ బాబు బ్రహ్మానందం షూటింగ్ స్పాట్లో ఫన్నీ జోక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, లాంటి స్టార్స్ నటిస్తున్నా రు. మహా భారతం వంటి అద్భుత సీరియల్ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు. పాన్ ఇండియాగా రాబోతోన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఓక ప్రత్యక అతిధి పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించవల్సిన ఆ పాత్ర మోహన్ బాబు రిక్వస్ట్ తో బాలకృష్ణ నటిస్తారని తెలుస్తుంది. మొత్తానికి కన్నప్ప మంచి క్రేజీ మల్టి స్టార్స్ సినిమాగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *