సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, శుక్రవారం మీడియా సమావేశంలో ఇటీవల సీఎం చంద్రబాబు ఖజానా ఖాళీ అయ్యిందని చెప్పుకొంటూ ప్రజలకిచ్చిన హామీలు,పధకాలుఎగవేత కు పాలబడుతున్నాడని ఆరోపించారు. నిజానికి 2109 లో వేల కోట్లు చెల్లింపు బకాయిలు పెట్టి చంద్రబాబే ఖజానా కాళీ చేసి కేవలం 100 కోట్లు ఖజానాలో ఉంచి వెళ్లిపోయాడని, ఆయన హయాంలో పెట్టిన కోట్ల బకాయిలు తమ హయాంలో చెల్లించామని, మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చేసరికి 2 రోజుల ముందు ఖజానా లో 7 నుండి 8 వేల కోట్లు ఉన్నాయని.. మరి నా హయాంలో 14 లక్షల అప్పులు ఉన్నాయని దొంగ ప్రచారం చంద్రబాబు చేయిస్తున్నారని, గవర్నర్ ప్రసంగం ద్వారా కూడా 10 లక్షల కోట్లు అప్పులు చేశామని అబద్ధం చెప్పించారని.. వాస్తవంగా 2014 నుండి 2019 వరకు ఆయన హయాంలోనే అభివృద్ధి తక్కువ.. అవినీతి ఎక్కువ చేసారని.. మరి మా వైసీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో కూడా ప్రజలకు ఉచిత వైద్య రక్షణ తో పాటు అభివృద్ధి లో కూడా దేశంలోనే AP ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర నివేదికలు మీడియాకు చూపించారు. మరి చంద్రబాబు హయాంలో రాష్ట్రం పురోగతిలో వెళ్తుందా? వెనక్కి వెళ్తుందా? అని ప్రశ్నించారు. దీనిని ప్రజలంతా ఆలోచించాలన్నారు,అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక అంటూ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ పార్టీవారే మొత్తం వేలకోట్లు విలువ చేసే ఇసుక కొండలను దోచేశారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రశ్నిస్తారు. ప్రజలెవరూ రోడ్లపైకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే.. ఏకంగా హత్యలు, దాడులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్ ఆరోపించారు. జగనే వుండి వుంటే ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు, వసతి దీవెన క్రమం తప్పకుండా వచ్చేవి అని విద్యార్థులు అనుకుంటున్నారు. వసతి, విద్యా దీవెన కింద రూ. 18,000 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం అని పేరు పెట్టి.. తల్లులందరికీ శఠగోపం పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రైతు భరోసా డబ్బు రైతులు ఇరవై వేలు ఎపుడు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో తన ధర్నాకు బీజేపీ తో సహా అన్ని పార్టీలను ఆహ్వానించానని అయితే రాహుల్ గాంధీ తప్ప ఇండియా కూటమిలో అన్ని పార్టీల ప్రతినిధులు వచ్చారని , రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ తో కూడా దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ కు మణిపూర్ లో అల్లర్లలో కాంగ్రెస్ కు ఎదో కలసివస్తుంది అని, ఏపీలో టీడీపీ దాడులు హత్యలు ఆయనకు కనపడని ఎద్దేవా చేసారు.
