సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ – 4 వద్ద 62 అడుగుల మహాగణపతి మట్టి విగ్రహం ను 2 భారీ క్రేన్ ల సాయంతో నిమజ్జనం జరిగింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. క్రేన్ నెంబర్- 4 వద్ద చివరి పూజలు అందుకున్న తర్వాత సరిగ్గా నేటి గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో బడా గణేష్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు. మహాగణపతి నిమజ్జనోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం చేరుకున్నారు. బై బై గణేషా అంటూ..మరల వినాయక చవితికి త్వరగా రావాలని కోరుకొంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. పోలీస్ భద్రతా తో పాటు ట్యాంక్ బండ్ దగ్గర 200 మంది గజ ఈతగాళ్లు ను ఏర్పాటు చేసారు.
