సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా అన్ని నిత్యావసర వస్తువులతో పాటు దక్షిణాది వారు దినసరి ఆహారంలో ఉపయోగించే బియ్యం ధరలు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పట్టణ ప్రాంత ప్రజలు బియ్యానికి ఎక్కువ ధరలు చెల్లిస్తున్నారని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. . దేశ వ్యాప్తంగా 315 జిల్లాల్లోని పట్టణాల నుండి 22 వేలకుపైగా పౌరుల అభిప్రాయాలు సేకరించిన సర్వే బృందంనికి ప్రతి 3 మూడు నివాసాల గృహిణుల్లో ఒకరు ఈ సంవత్సరం బియ్యానికి 20% లేదా అంతకంటే ఎక్కువ ధర చెల్లించినట్లు తెలిపారు. పేదలకు ఎలానూ ప్రభుత్వ ఉచిత బియ్యం అందుతుంది. ఇక పట్టణ భారతీయులు ఎక్కువగా ఉపయోగించే తొలి మూడు బియ్యం రకాల్లో సోనా మసూరి, బాస్మతి, పొన్ని రైస్ ఉన్నట్లు సర్వేలో తేలింది. ఉత్తరాదిలో పండించే ప్రీమియం రకం, బాస్మతి బియ్యం విదేశాలకు ఎగుమతులు పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని సర్వే పేర్కొంది.
