సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని జరుగుతున్నా ప్రచారం అవాస్తవమని మరోసారి పార్లమెంట్ వేదికగా తేలిపోయింది. నేడు,సోమవారం ఏపీ అప్పులపై లోక్ సభలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇస్తూ.. ‘ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎం ను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారుసులకు లోబడే ఏపీ రాష్ట్రము అప్పులు ఉన్నా యి. 2019 మార్చి నాటికి( టీడీపీ పాలన హాయంవరకు) ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు ఉన్నాయి. తదుపరి 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42,442 కోట్లకు పెరిగాయి. అంటే గత నాలుగేళ్లలో( వైసిపి సర్కార్ హయాంలో) ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
