సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు , భీమవరం బ్రాండ్ .. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం.’ ‘అతడు, ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న ఈ 3వ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గత మంగళవారం రాత్రి గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్‌లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మహేష్ బాబు‌గారు ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు. త్రివిక్రమ్‌గారు హీరో క్యారెక్టర్‌ని రాసిన విధానం బాగుంది. ‘పోకిరి, దూకుడు’ వంటి సినిమాల తరహాలో మహేష్‌గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ మధ్య ప్రతి సినిమాలో ఒక పాటకు మహేష్‌ డ్యాన్స్ ఇరగదీస్తున్నారు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ వస్తుంది అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మహేష్ బాబు తో అతడు , ఖలేజా చేసి పదేళ్లు అవుతున్న ఎదో 2 ఏళ్ళ క్రితం పనిచేసినట్లు ఉంది. ఇప్పటికి ఆయన కుర్రాడే.. అందంతో పాటు కష్టపడే గుణంలో బిహేవియర్ లో ఎక్కడ మారలేదు. సూపర్ స్టార్ కృష్ణ లేకుండా ఈనాటి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి ని ఊహించలేము.. అంత మంచి మనిషి, మహామనిషి కొడుకు గా మహేష్ బాబు తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఇక మహేష్ బాబు మాట్లాడుతూ.. అభిమానులు కోరుకొనే ఫుల్ మాస్ యాక్షన్ , డాన్స్ లు ఇందులో ఉంటాయి. సంక్రాంతి కి గుంటూరు కారం రావడంతో పాటు నా స్వంత ప్రాంతం గుంటూరు లో ఈ పంక్షన్ చెయ్యడం ఆనందంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *