సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’.2024 సంక్రాంతి పోటీ బరిలోకి దిగుతున్న విషయం విదితమే.. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా ప్రొమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ కృష్ణ గతంలో నటించిన సూపర్ హిట్ సినిమా కిరాయి కోటిగాడు సినిమా లుక్స్ ను తలపిస్తు, మాస్ డైలాగ్స్ లో వెటకారం కలగలిపి గుంటూరు కారం లో మహేష్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసారని తెలుస్తుంది.
