సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళ్లు అర్పించారు. ఆ తర్వాత గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా నేటి ఉదయం మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి కి ఘన నివాళ్లు అర్పించి తదుపరి..ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే భారీ అన్నసమారాధన నిర్వహించారు. పట్టణం అంత కోడలి నాని వర్సెస్ టీడీపీ అన్న రీతిలో భారీ ఫ్లక్సీలు కట్టారు. ఎమ్మెల్యే నాని, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళ్లు అర్పించి వెళ్ళాక వైసీపీ టీడీపీ పార్టీల అభిమానుల మధ్య త్రోపులాట జరిగింది. కాగా గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసులు ఆంక్షలు కు విరుద్ధంగా వారు పెట్టిన బారికెట్స్ తొలగించి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు నిర్వహిస్తున్నారని పోలీసులు అడ్డగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ పార్టీ ఇంచార్జ్ వెనిగళ్ల రామ్మోహన్ నాయకత్వంలో టీడీపీ, శ్రేణలు భారీకేడ్లను తోసుకుంటూ ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో పోలీసులు – టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో చంద్రబాబు బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది హాజరవుతారని టీడీపీ నేతలు భారీ అంచనాలపై ఉన్నారు.
