సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘మహాకవి కాళిదాసు’ రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కావ్యాన్ని దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ 3డి సినిమా గా నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. దర్శకుడు గుణశేఖర్ గతంలో ‘ఒక్కడు’ , ‘చూడాలని ఉంది‘ అర్జున్ , రాణి రుద్రమదేవి వంటి హిట్ సినిమాలో భారీ సెట్స్ తో కనువిందు చేసారు. మరి ఈ సినిమా లో సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు , శివ బాలాజీ , అల్లు అర్హ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, వంటి ప్రముఖులు నటించారు. కధ చాలామందికి తెలిసిందే.. టూకీగా .. విశ్వామిత్ర మహర్షి , మేనక లకు ఒక పాప పుడుతుంది. ఆ పాపని వారు అడవిలో వదిలేస్తారు.అయితే ఆ పాపను పక్షులు తీసుకువెళ్లి కణ్వ మహర్షి ఆశ్రమంలోవదిలేస్తాయి, కణ్వ మహర్షి ఆ పాపకి శకుంతల అని నామకరణం చేస్తాడు. శకుంతల పెద్దది (సమంత) అవుతుంది. ఒకనాడు దుష్యంత మహారాజు (దేవ్ మోహన్) వేటకు వచ్చి కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను చూసి, మోహించి, ప్రేమలో పడి గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అయితే శాకుంతలకు దుర్వాస ముని ( మోహన్ బాబు) శాపంతో..గర్భవతి అయిన ఆమెను స్వీకరించడానికి ఇష్టపడడు.తరువాత జరిగే పరిణామాలు తెరపై చూడవలసిందే.. ఇక సినిమా ఎలా ఉందంటే.. టివి సీరియల్ స్థాయిలోఉంది. కొన్ని చోట్లా మినహా గ్రాఫిక్స్ నాసిరకం గా ఉన్నాయి.. సమంత శాకుంతల పాత్ర కు అసలు సూట్ కాలేదు. ఒక్క మోహన్ బాబు తప్ప నటీనటులతో ఒక్కరి మొహం లో కూడా ఒక్క ఎమోషన్ లేదు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చక్కగా చేసింది. చివరి పదిహేను నిముషాలు ఆమె కనిపించి కనువిందు చేసింది. ప్లస్ పాయింట్ ఏంటి అంటే అది ఒక్క మణిశర్మ సంగీతం మాత్రమే. ఒక్కమాటలో .. దర్శకుడుగా గుణశేఖర్ చాల నిరాశ పరిచాడు.
