సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం హితకారిణి ధార్మిక భవనం సమీపం లో గోదావరిలో కనిపించిన వృద్ధులయిన భార్యా భర్తల మృతదేహాల చూసి స్థానికులు లో సైతం విషాదాన్ని నింపింది. పోలిసుల అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి చేస్తున్న ప్రాధమిక దర్యాప్తులో తాజగా వారి బంధువుల ఇచ్చిన సమాచారం ప్రకారం..ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు పంపుల చెరువు ప్రాంతానికి చెందిన కేదారి కొండలరావు(65) స్థానిక ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పనిచేసి కరోనాకు ముందు ఉద్యోగ విరమణ చేశారు. వారి భార్య ఉమామల్లేశ్వరి (59) తో కలసి ఈనెల 19న గురువారం సాయంత్రానికి గోష్పాద క్షేత్రానికి చేరుకున్నారు. నిన్న శుక్రవారం గోదావరిలో మృ తదేహాలుగా తేలారు. సీఐ రవికుమార్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.ఆయన దర్యాప్తులో కొండలరావు కు నెలకు సుమారు రూ.70 వేల దాకా పిం ఛను వస్తోం ది. కుమార్తె లీలా గాయత్రి భర్తతో కలసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కొడుకు శ్రీకాంత్ ఇంజనీరింగ్ చదివి కూడా అడ్డదారులు తొక్కి జూదాలు ఆడుతూ ఆర్ధికంగా నష్టపోయి వారి మనోవ్యధకు కారణం అయ్యాడని తెలుస్తుంది. తమ్ముడి జీవితాన్ని సరిదిద్దేందుకు అక్క గాయత్రి సైతం అన్ని రకాలుగా సహకరించారు. అయిన అతని పద్దతి మారకపోవడంతో భార్య భర్తలు ఆత్మహత్య చేసుకొన్నారని భావిస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రుల చనిపోయారన్న సమాచారం అమెరికాలోని సోదరికి తెలిసింది కానీ..కుమారుడుకి తెలిసే మార్గం లేకపోయింది. అతని ఫోన్కు ప్రయత్నిస్తుంటే కలవడంలేదు. ఇది తాజా పరిస్థితి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *