సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాల నుండి వేలకోట్ల ఆక్వా ఎగుమతులు జరుగుతాయి. అయితే కరోనా’ తరువాత ఆక్వా పరిశ్రమ ఎన్నో ఆటుపోట్లు ను ఎదురొకొంటుంది. కాస్త తేరుకోవడం మరల దిగిపోవడం ఇదే తీరు.. అయితే గత 3 నెలలు గా మాత్రం రొయ్యలు లో పడిపోయిన ధర మరల పెరగలేదు. నిజానికి గత దశాబ్దం నుండి భారీగా మెతలు, మందులు, చెరువుల లీజులు నిర్వహణ ధరలు బాగా పెరిగాయి తప్ప రొయ్య రేటు పడిపోవడం తప్ప పెరగలేదు. దీనికి తోడు విదేశాలకు రొయ్య ఎగుమతులకు డిమాండ్ పడిపోవడం తో పాటు, మన సరిహద్దు రాష్ట్రము ఒరిస్సా, గుజరాత్ నుండి నుండి తక్కువ నిర్వహణ ఖర్చులతోనే రొయ్య మనకన్నా తక్కువ ధరలకే (1కేజీ కౌంటీలో కనీసం 20 రూ, తక్కువకు )ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతులు పెరగటం మరో కారణం. మన గోదావరి జిల్లాలలో రొయ్యలకు యాంటీ బయోటిక్స్ వినియోగం ఎక్కువ ఉపయోగిస్తారని కొన్ని విదేశాలకు సరుకు తీసుకోవడం లేదు. గతంలో రొయ్యలకు చైనా, అమెరికా వంటి దేశాల్లో మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు వారు కూడా ఆస్ట్రేలియా, ఈక్వడార్ తదితర దేశాల నుండి రొయ్యలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుస నష్టాలతో చాలామంది రైతులు ఆక్వా సాగు నుంచి తప్పుకున్నారు. చక్కగా పండే వరి పొలాలలో ఇప్పుడు ఉప్పునీటి కయ్యలు మిగిలాయి. ప్రస్తుతం వంద కౌంట్‌ రూ. 200, 70 కౌంట్‌ రూ.245, 60 కౌంట్‌ రూ.265, 50 కౌంట్‌ రూ.280 30 కౌంట్ కు 300 వరకు ధరలు పలుకుతున్నాయి. ( నిజానికి 10ఏళ్ళ క్రితం కూడా 30 కౌంట్ 350 రూపాయలు పలికిన రోజులు ఉన్నాయి) భీమవరం రిటైల్ మార్కెట్ లో కూడా స్థానిక కొనుగోలుదారులకు కు రొయ్యలు తక్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి.వంద కౌంట్‌ రొయ్యకు కనీసం సంవత్సరంపాటు ఫిక్స్‌డ్‌ రేట్‌ రూ.230 ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోని చేప, రొయ్య, పీత లు పండించే ఆక్వా రైతులకు నేరుగా ప్రత్యేక రాయితీలు ,నాణ్యమైన సీడ్‌ను అందుబాటులోకి తేవడం మేత ధరలపై పర్యవేక్షణ ఉండడంతోపాటు కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటుచేయాలని రైతాంగం కోరుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *