సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా వేళా.. మరో ప్రక్క ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూడా నగారా మోగడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఈనెల 11న నోటిఫికేషన్ జారీ కానుంది.అదే రోజు నుంచి పోటీచేసే అభ్య ర్థులు నామినేషన్ దాఖలు చేయవచ్చు . ఈనెల 18 వరకు నామపత్రాలు స్వీకరించి, 19న పరిశీలన చేయనున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 21 వరకు గడవు ఉంది. డిసెంబరు 5న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు చేస్తారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో పీడీఎఫ్ అభ్యర్థిగా యూటీఎఫ్ నేత షేక్ సాబ్జీ ఘన విజయం సాధించారు.అయితే అయన పశ్చిమ గోదావరి జిల్లాలోనే రోడ్డు ప్రమాదంలో 2023 డిసెంబరు 12న ఆయన దుర్మరణం చెందటంతో అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈసారి ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా భీమవరంకి చెందిన యూటీఎఫ్ రాష్ట్రకోశాధికారి బి.గోపిమూర్తిని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరినీ ఖరారు చేయలేదు. ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థి రెండేళ్ల మూడు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో నేటి మంగళవారం నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసారు.
