సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 456 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 3,14,984 మంది ఓటర్లకు 2,18,902 మంది ఓట్లు వేశారు. గత గురువారం ఉదయం నుండి మందకొడిగా సాగిన ఓటింగ్ మధ్యాహ్నం నుండి వేగం పెరిగింది. పోలింగ్ శాతం 69.50గా నమోదైంది. ఓటర్లు కు ముందుగానే పలు వార్డు సచివాలయంల లో ఓటర్ షిప్స్ పంపిణి సక్రమంగా జరగకపోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గటానికి ఒక ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఓటర్లు కూడా శ్రద్ద చూపలేదు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలలోని అధికార టీడీపీ ఎమ్మెల్యే లు చొరవ తోనే మధ్యాహ్నం నుండి ఓటర్లు పోలింగ్ శాతం పెరిగినట్లు వాతావరణం కనిపిస్తుంది. ఏలూరు జిల్లాలో 42,282 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 29,651 మంది ఓటు హక్కును వినియో గించుకున్నారు.ఏలూరు జిల్లాలో 70 శాతం ఓటింగ్ జరిగింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని 93 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 70,052 మంది పటభద్రుల ఓటర్లుకు గాను 48,893 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,960, మహిళలు 20,933 మంది ఉన్నారు. పోలింగ్ 69.80 శాతంగా నమోదైంది. పాలకొల్లు నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదైంది. పాలకొల్లు, యలమంచిలిలో సగటున 72 శాతం మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. దూరప్రాంతాల నుంచి ఓటర్లను రప్పించారు అని సమాచారం. మరి గెలుపు ఓటములు ప్రధానంగా టీడీపీ, పీడీ ఎఫ్ అభ్యర్థుల మధ్య ఉంటుందని విశ్లేషణ..
