సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికలలో కీలక నామినేషన్స్ ఘట్టం ముగిసింది. ఉమ్మ డి తూర్పు– పశ్చిమగోదావరి జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు చివరి రోజుకావడంతో ఏలూరు కలెక్టరేట్ లో గత సోమవారం దరఖాస్తులు పోటెత్తాయి. నిన్న ఒక్క రోజే 29 మంది అభ్యర్డ్లు లు 48 సెట్ల నామినేషన్ల వేశారు. దీంతో మొత్తం మీద 59 మంది 72 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.ఈరోజు మంగళవారం నామినేషన్ లను పరిశీలిస్తున్నారు.13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఇదే రోజు సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబి తాను ప్రకటిస్తారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉందని గమనించాలి. ఈ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలలో కూటమి అభ్యర్థి పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎన్నికలలో పాల్గొనడం లేదు.
