సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం గోవా రాష్ట్ర నూతన గవర్నర్ గా సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. శనివారం ఉదయం గోవా రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో నూతన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన అశోక్ గజపతిరాజును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శాలువాతో సత్కరించి పూలబొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ సంస్కృతి, ఆధ్యాత్మికత, పరిపాలనలో సమతుల్యత ఉన్న నాయకుడిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న శ్రీ అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలకంగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ , ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఏపీకి చెందిన కూటమి పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
