సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 3వ వార్డులోని కళాభవన్ వీధిలో నివాసం ఉంటున్న ముద్దన రమేష్ బాబు అనే వ్యక్తి ఇంటి ముందు బైక్ అపి ఇంటి లోపలకు వెళ్లి బయటకు వెచ్చేసరికి బైకు డిక్కీలో పెట్టిన 3 లక్షల రూపాయలు చోరీకి గురిఅయ్యాయి. దీనిపై అతడు అదేరోజు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. అయితే ఈ కేసులో ఇద్దరు దొంగలను అరెస్టు చేశామని డీఎస్పీ ఆర్.జి.జయసూర్య మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కేసు ను సీఐ ఎం .నాగరాజు ఆధ్వర్యంలో ఎస్సై లు కిరణ్ కుమార్ మరియు వీర్రాజు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేసిన దర్యాప్తు ఫలించి బాలరాజు, దాసు అనే ఇద్దరు నిందితులను గుర్తించామని, వారు దొంగతనం చేసాక రాజమహేంద్రం వరకు వెళ్లినట్లు ఆధారాలు దొరికాయని తడుఅప్రి వారి ఫోటోలను రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్ లకు పంపగావారిలో విజయనగరం జిల్లా కొత్తవలస మం డలం సుందరయ్య పేట గ్రామానికి చెందినఎం .బాలరాజును ఈ నెల 9న, ఒడిశాలోని గంజాం జిల్లా కు చెందిన దాసు రబిని గత శుక్రవారం అరెస్టు చేసి నగదు కూడా స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. దొంగలు పట్టుకొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *