సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని గొరగన మూడి గ్రామంలో జరిగిన మార్వాడిల ఆత్మీయ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మరియు నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల ముఖ్య అతిదులుగా పాల్గొన్నారు. జైన్ పెద్దలు వారికీ సంఘీభావం ప్రకటించారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న తమకు జైన్ సోదరసోదరీమణులు మద్దతుగా 2 ఓట్లు ఫ్యాను గుర్తులపై వెయ్యాలని అభ్యర్ధించారు. దానికి ప్రతిగా కొందరు జైన్ పెద్దలు గతంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తమకు అందజేసిన సహకారాన్ని, సమస్యల పరిష్కారాన్ని గుర్తుచేసుకొని రాబోయే ఎన్నికల్లో భీమవరం నియోజకపరిధిలో జైన్స్ అందరూ ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల మరియు గ్రంధి శ్రీనివాస్ గారి గెలుపునకు తోడ్పడతామని తెలిపారు
