సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ పరిధిలోని భీమవరం, వీరవాసరం మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఇంటింటికి మన ప్రభుత్వం లో భాగంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకొంటున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ .. ప్రభుత్వ స్థలాలు పొందిన లబ్దిదారులను ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని , ప్రభుత్వ సహకారం అందిస్తామని కోరుతున్నారు. ఇదిలా ఉండగా గత బుధవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ పిడి ఎవి రామరాజు, డిఇబి వెంకటరమణతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు పంపిణీ చేయడంతోపాటు పట్టాలు కూడా ఇచ్చామని అంతేకాకుండా .. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా రూ.1లక్ష 80వేలు అందించడంతో పాటు మరో 35వేలు బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని.. . దీనిపై గ్రామాల్లో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు
