సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని భారీ సముద్ర తీరప్రాంతాన్ని..రాష్ట్ర వాణిజ్య రాజధానిగా విశాఖ ను హైలైట్ చేస్తూ పారిశ్రామిక అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వె స్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడం 13 లక్షల కోట్ల పైగా భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం అద్భుతం.. 30కిపైగా కార్పొ రేట్ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. భవిషత్తు లో అంత సక్రమంగా జరిగితే ఆంధ్ర ప్రదేశ్ దేశంలో నెంబర్ 1 గా ఎదగటం ఖాయం .. నిపుణుల అంచనా ప్రకారం 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్య క్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒప్పందాలు కుదుర్చు కొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్య మంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్య వేక్షణ కమిటీ వేశారు. ఎవరికైనా పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రంలో ఏదయినా సమస్య ఇబ్బంది అనిపిస్తే తనకు ఒక్క ఫోన్ చేస్తే పరిస్థితి సర్దుబాటు చేస్తానని సీఎం జగన్ స్వయంగా ప్రకటించడం హైలైట్ గా నిలచింది
