సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన నియోజకవర్గం మచిలీపట్టణం లో భారీ స్థాయిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించడానికి వస్తున్నా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నుద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని తనదయిన వ్యంగ శైలీ లో తాజగా కీలక వ్యాఖ్యలు చేసారు.. .. బందర్‌లో జరిగే జనసేన సభ ఆవిర్భావ సభ లా నిర్వహించలేరని తస్మదియ దూషణ సభ మాత్రమేనని, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. కులానికి దూరం అంటూనే తన కాపు కులానికి, బిసి లకు అన్నాయం జరిగిదని పవన్ కళ్యాణ్ చేస్తున్న రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చంద్రబాబు హయాంలో ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కాపులు స్వతంత్రంగా ఉండాలని చెబుతూనే తాను మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు కు ఊడిగం చేస్తానని పవన్ చేస్తున్న కులరాజకీయం చుస్తే ఎవరికైనా అర్ధం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటం సభ, మచిలీపట్నం సభకు ఏమీ తేడాలేదన్నారు. కాపులకు ఎన్నో మేళ్లు చేసిన సీఎం జగన్‌ను బలపరిచే కాపు నాయకులని తిట్టడం చంద్రబాబును బలపరచడం కోసమే ఈ సభ అని పేర్ని నాని విమర్శించారు. కాపు కులాన్ని, కులస్తులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ కల్యాణ్ ఎన్నోసార్లు చేస్తున్నాడని పేర్ని నాని విమర్శించారు. పవన్ రాజకీయ సినిమా.. ఫ్లాప్ అయినా.. హిట్ అయిన పెద్దగా నష్టం లేదన్నారు. ప్యాకేజీ స్టార్ అంటే ఇష్టం లేదు కానీ.. స్టార్ ప్యాకేజీ అంటే పవన్‌కు ఇష్టమని విమర్శించారు.ఇప్పడు కాకపోతే మరోసారి అధికారంలోకి వస్తానని పవన్ ఎప్పటికి చెప్పడని.. అతనికి చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలని ఎద్దేవా చేసారు.
