సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబుకు రూ. 118 కోట్ల బ్లాక్ మనీ ఫై వివరణ కోరుతూ ఆదాయ పన్ను శాఖ అధికారులు.నోటీసులు ఇచ్చారన్న విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక లో బయటపెట్టి పెను సంచలనం రేపింది. పైగా మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ..ఐటి శాఖ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది అని ఆ పత్రిక ఆధారాలతో పేర్కొంది. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల రూపంలో రూ. 118 కోట్ల ముడుపులు అందుకొన్నారని అభియోగం. ఈ క్రమంలో చంద్రబాబు పీఏ గా పనిచేసిన శ్రీనివాస్ ముడుపులు డెలివరీ చేసినట్లు షాపూర్జి పల్లోంజి మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చాడు కూడా. అందుకే తాజా నోటీసుల్లో.. ఇన్ఫ్రా కంపెనీల ద్వారా అందుకున్న రూ. 118 కోట్లను బ్లాక్ మనీగా (వెల్లడించని ధనం)ఎందుకు పరిగణించరాదో తెలపాలని బాబును ITకోరింది ఐటీ శాఖ అంతకు ముందు రీఅస్సెస్ చేయాలని చంద్రబాబు కోరగా.. షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించింది ఐటీ శాఖ. ఆపై నోటీసులు జారీ చేసింది. 2017లో బాబు సీఎంగా ఉన్నపుడే షాపూర్ జీ సంస్థ తరపున ఎంవీపీ టెండర్ వేశారు. ఎం వీపీ కంపెనీ, అనుబంధ సంస్థపై 2019లో ఐటి సోదాలు నిర్వహించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *