సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నేడు, సోమవారం జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై కక్ష లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. కేంద్రంలో బీజేపీ ఉందని.. చంద్రబాబు మోసాల్లో, అవినీతిలో పార్ట్‌నర్ దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని అంటున్నాడు మరి.. . బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్ళేనన్నారు. గతంలో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి చేసిన అక్రమాలు, అవినీతిని పసిగట్టిన కేంద్ర నిఘా సంస్థలు సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి వచ్చాయని జగన్ అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా లేదన్నారు. టీడీపీ పెద్ద గజదొంగల ముఠా బాబు పార్టీ తో పొత్తు పెట్టుకొన్న దత్త పుత్రుడు వీరిరువురు నయా జమీందారి వ్యవస్థను సమర్ధిస్తూ పేదలకు ద్రోహం చేస్తున్నారు. పెత్తందారీ ధనవంతులు అంత ఒక కూటమిగా వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో మనపై కి పోరుకు వసున్నారు. మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు రానున్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో ఏ కులంలో ఉన్న సరే.. పేదలు అందరు ఒక పక్షంగా వైసిపి కి మద్దతు పలకవల్సిన సమయం వచ్చింది. చంద్రబాబు మోసాల్లో, అవినీతిలో పార్ట్‌నర్ దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానేనన్నారు. ఒకడు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయ్యిందని.. అయినా ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో నాయకులు లేరని జగన్ ఎద్దేవా చేశారు. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడన్నారు. ఆయనకు జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుందన్నారు.
.
