సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి 10 గంటలకు మచిలీపట్టణం ఆలస్యంగా చేరుకోవడంతో లక్షలాది మంది అభిమానులు పాల్గొన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ రాత్రి నాదెండ్ల, అర్ధగంట ప్రసంగం తదుపరి పవన్, ప్రసంగాన్ని 10 -30 కి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఇటీవల ఒక పత్రిక లో తనకు 1000 కోట్లు ప్యాకేజి సీఎం కెసిఆర్ నుండి వచ్చిన వార్తలను, టీడీపీ ఫై పొత్తు కుదిరింది అన్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సారి ఎవరి వల్ల మోసపోనని, తనకు సంపూర్ణ నమ్మకం వస్తేనే పొత్తులు కుదురుతాయని, అవసరమైతే ఒంటరిగా కూడా బరిలోకి దిగుతామని జసేనన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ దేశానికి నరేంద్ర మోదీ అవసరమని భావించానని అన్నారు. ప్రత్యేక హోదాకోసం తాను నిలబడి బీజేపీని దూరం చేసుకుంటే అది వైసీపీకి దగ్గరయిందన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీలు కలసి పనిచేసుంటే ఇప్పటికే టీడీపీ కంటే బలపడేవాళ్లమన్నారు. తెలుగుదేశం మీద తనకు ప్రత్యేక ప్రేమ లేదన్నారు. చంద్రబాబు అంటే గౌరవమేనని అన్నారు. ఈసారి అసెంబ్లీలోకి ఖచ్చితంగా అడుగుపెడతామని తెలిపారు. తనతో పాటు పోటీ చేసిన వాళ్లంతా అసెంబ్లీలోకి వెళ్లాల్సిందేనన్నారు. కాపు కులంలో పుట్టిన గౌరవం పెంచేలా ప్రయత్నం ఉంటుందని, మిగతా బిసి, ఎస్ సి, ఎస్టీ లను కలుపుకొని వెళతానని.. వైసీపీ పాలనా అంతానికి కృషి చేస్తానని .. మీరు ఏం జరిగితే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. ఓటును వృధాను కానివ్వమని అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందని అన్నారు.
